మంచి ఆలోచన ఎవరు ఇచ్చినా స్వీకరిద్దాం : సీఎం చంద్రబాబు
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.) ప్రభుత్వ పాలనలో మెరుగైన ఫలితాలు వచ్చే ఫీడ్ బ్యాక్ కు ప్రాధాన్యం ఇస్తున్నాం. మంచి ఆలోచన ఎవరు ఇచ్చినా స్వీకరిద్దాం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎస్డీపీ కేపీఐ, పబ్లిక్ పర్షపన్ గోల్స్ పై కలెక్టర్ల సదస్సు 5లో సీఎం
చంద్రబాబు


అమరావతి, 17 డిసెంబర్ (హి.స.) ప్రభుత్వ పాలనలో మెరుగైన ఫలితాలు వచ్చే ఫీడ్ బ్యాక్ కు ప్రాధాన్యం ఇస్తున్నాం. మంచి ఆలోచన ఎవరు ఇచ్చినా స్వీకరిద్దాం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

జీఎస్డీపీ కేపీఐ, పబ్లిక్ పర్షపన్ గోల్స్ పై కలెక్టర్ల సదస్సు 5లో సీఎం ప్రసగించారు. కేవలం ప్రాసెస్ కోసం కాకుండా ఫలితాలు ఎలా వస్తున్నాయనే దానిపై పని చేయాలని సీఎం అన్నారు. డబ్ల్యూహెచ్ ఓ సస్టెనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030కి సాధించాలని పెట్టుకుందన్నారు. భారత్ కూడా అందులో సిగ్నేటరీగా ఉందన్నారు. అందులోని పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కోసం మనం పని చేస్తున్నామన్నారు. ప్రజలకు సంతృప్తి లేకుండా పని చేస్తున్నాం అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేసే పనిలో ప్రజలు కలిసి వస్తున్నారా లేదా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఒకప్పుడు ఇవన్నీ కష్టంగా ఉండేవన్నారు. తాను నాలుగోసారి సీఎం అయ్యానని పేర్కొన్నారు. 90వ దశకంలో టెక్నాలజీని ప్యాషన్ గా దత్తత తీసుకున్నాం అన్నారు. ఈ ఆఫీస్, ఫైల్స్ డిస్పోసల్, పీజీఆర్ఎస్ వంటివి ఇప్పుడు వచ్చాయన్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande