మహిళా క్రికెటర్ శ్రీ చరణికి రాష్ట్ర ప్రభుత్వం నగదు అందజేసింది
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.) అమరావతి, డిసెంబర్ 17: మహిళా క్రికెటర్ శ్రీచరణికి ( రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం అందజేసింది. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రీచరణిని ప్రభుత
మహిళా క్రికెటర్ శ్రీ చరణికి రాష్ట్ర ప్రభుత్వం నగదు అందజేసింది


అమరావతి, 17 డిసెంబర్ (హి.స.)

అమరావతి, డిసెంబర్ 17: మహిళా క్రికెటర్ శ్రీచరణికి ( రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం అందజేసింది. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రీచరణిని ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. మంత్రి నారా లోకేష్ రూ.2.5 కోట్ల చెక్‌ను శ్రీచరణికి అందజేశారు. ఈరోజు (బుధవారం) ఉండవల్లి నివాసంలో క్రికెటర్ శ్రీచరణికి మంత్రి లోకేష్ స్వయంగా చెక్‌ను అందించారు. ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande