పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన ఏడు గ్రామాలు..
నాగర్ కర్నూల్, 17 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో నేడు తుది విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా పల్లెలన్నీ పంచాయితీ ఎన్నికలతో సందడిగా మారితే నాగర్ కర్నూల్ జిల్లాలో మాత్రం ఏడు గ్రామాలు ఎన్నికలకు దూరం అయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించ
పంచాయతీ ఎన్నికలు


నాగర్ కర్నూల్, 17 డిసెంబర్ (హి.స.)

రాష్ట్రంలో నేడు తుది విడత ఎన్నికలు

జరుగుతున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా పల్లెలన్నీ పంచాయితీ ఎన్నికలతో సందడిగా మారితే నాగర్ కర్నూల్ జిల్లాలో మాత్రం ఏడు గ్రామాలు ఎన్నికలకు దూరం అయ్యాయి.

తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. చారకొండ మండల పరిధిలోని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు తమకు ఎన్నికలు వద్దని చెబుతున్నారు. డిండీ నార్లాపూర్ ఎత్తిపోతల పథకం కింద నిర్మించ తలపెట్టిన జలాశయం వల్ల తమ గ్రామాలు ముంపునకు గురవుతాయనే భయంతో ప్రజలు ఎన్నికలు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులు అంతా నిరాహార దీక్షలో కూర్చుని న్యాయం కోసం నేను సైతం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తీవ్ర నిరసన తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande