పోలింగ్ వేళ వికారాబాద్, చెన్నారావుపేటలో ఘర్షణలు
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) పోలింగ్ సందర్భంగా ఇవాళ పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటు అడుగుతున్నారని ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పం
పోలింగ్ ఘర్షణ


హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.)

పోలింగ్ సందర్భంగా ఇవాళ పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటు అడుగుతున్నారని ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు, వారి వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో సర్పంచ్ అభ్యర్థి బోయిని రాములుకు గాయాలవగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో ఓ పోలింగ్ స్టేషన్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande