
ఆసిఫాబాద్, 17 డిసెంబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం విషాదం నింపింది. రాస్పెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రాజయ్య, ఎన్నికల్లో ఓడిపోతానేమో అనే భయం ఒత్తిడితో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. నామినేషన్లు వేసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం కోసం తన వద్ద డబ్బులు లేవని రాజయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గెలుపు కోసం ధన ప్రవాహం అనివార్యమైన ఈ తరుణంలో, డబ్బు లేని కారణంగా ఓడిపోతామనే టెన్షన్ తట్టుకోలేక ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.
వెంటనే గమనించిన గ్రామస్తులు, అభ్యర్థి రాజయ్యను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు