ఆటోను ఢీకొన్న భారీ వాహనం.. ఇద్దరు యువకులు మృతి
నారాయణపేట, 17 డిసెంబర్ (హి.స.) ఆటోను భారీ వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ప్రమాదం మంగళవారం మధ్య
యాక్సిడెంట్


నారాయణపేట, 17 డిసెంబర్ (హి.స.) ఆటోను భారీ వాహనం ఢీకొనడంతో

ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ప్రమాదం మంగళవారం మధ్యరాత్రి తర్వాత జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భారీ వాహనం ఢీకొనడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని వారు తెలిపారు. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ప్రమాదానికి గురైన ఆటో మక్తల్ పట్టణానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించి సంబంధిత వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande