
వరంగల్, 17 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.
వరంగల్ జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద చేసిన ఏర్పాట్లు ఓటర్లను అబ్బురపరుస్తున్నాయి.
లక్నేపల్లి, ఖానాపూర్, రాగంపేట, ఉప్పరపల్లి, తిమ్మరాయనిపహాడ్, ఇటుకాలపల్లి, అలంకాణిపేటలోని పోలింగ్ కేంద్రాల ముందు ముగ్గులు వేసి, పచ్చని తోరణాలు కట్టారు. పూల దండలు కట్టి పచ్చదనంతో గ్రీన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సంబురపడుతున్నారు. సాధారణంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూలో నిలబడి ఓటు వేయాలంటే ఓటర్లు నిరుత్సాహ పడతారు. కానీ పచ్చదనం, రంగులతో సంక్రాతి సంబరాల మాదిరిగా పోలింగ్ కేంద్రాలు కనిపించడంతో ఓటర్లు ఎగబడి మరీ వస్తూ ఓటు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు