సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగపూట రద్దీ నేపథ్యంలో 16 అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది. జనవరి 9 నుండి 19 తేదీల మధ్య రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొ
ప్రత్యేక రైళ్లు


హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.)

సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగపూట రద్దీ నేపథ్యంలో 16 అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది. జనవరి 9 నుండి 19 తేదీల మధ్య రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అదనంగా కేటాయించిన ప్రత్యేక రైళ్లలో శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్ (07289), సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్(07290), సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్ (07288), వికారాబాద్_ శ్రీకాకుళం రోడ్డు 2- (07294), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్ (07291), సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు (07292), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్ (07293), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్ (07295) ఉన్నాయి. ఈ రైళ్లు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయణపాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామల్ కోట్, అన్నవరం, తుని, ఎలమంచిలి, దువ్వాడ, అనకాపల్లి, కొత్తవలస, విజయనగరం, పెందుర్తి, చీపురు పల్లి స్టాపుల్లో ఆగుతాయని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande