
మహబూబ్నగర్, 17 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు
మూడో(తుది) విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా జరుగుతుంది. కానీ మహబూబ్నగర్ జిల్లాలోని ఏడు గ్రామాల పరిస్థితి మాత్రం విభిన్నంగా ఉంది. జిల్లాలోని అమ్రాబాద్ మండలంలోని నల్లమల్ల షెడ్యూల్డ్ ప్రాంతానికి చెందిన ఈ ఏడు గ్రామాలు పంచాయతీలు ఎన్నికలకు నోచుకోలేదు. దీనికి ప్రధాన కారణం, ఈ గ్రామ పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాకపోవడం. ఈ ప్రాంతంలో ఓటర్లు లేకపోయినా, నిబంధనల ప్రకారం నల్లమల్ల షెడ్యూల్డ్ ప్రాంతంలో ఈ స్థానాలకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించారు. దీంతో ఎవరూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేక అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. ఈ కారణంగా ఏడు గ్రామాలు పంచాయతీ ఎన్నికలకు దూరమయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు