టాలీవుడ్లో విషాదం.. 'కేడి' సినిమా దర్శకుడు మృతి !
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో విషాదం చోటు చేసుకుంది. అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన కేడీ సినిమా దర్శకుడు కిరణ్ కుమార్ మృతి చెందారు. బుధవారం ఉదయం పూట యువ దర్శకుడు కిరణ్ కుమార్ తుది శ్వాస విడిచినట్లు చెబుతున్నార
టాలీవుడ్ డైరెక్టర్


హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.)

టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో

విషాదం చోటు చేసుకుంది. అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన కేడీ సినిమా దర్శకుడు కిరణ్ కుమార్ మృతి చెందారు. బుధవారం ఉదయం పూట యువ దర్శకుడు కిరణ్ కుమార్ తుది శ్వాస విడిచినట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో కిరణ్ కుమార్ బాధపడుతున్నారట. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ మరణించారు.

ఇక కిరణ్ కుమార్ మృతి నేపథ్యంలో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా కిరణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన లేటెస్ట్ మూవీ కింగ్ జాకీ క్వీన్ (KJQ) సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతలోపే ఈ విషాదం చోటు చేసుకుంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande