
కడప,17 డిసెంబర్ (హి.స.)వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత అనేక మంది వైసీపీ శ్రేణులు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. పలు నియోజవర్గాల్లో వైసీపీకి చెందిన కీలక వ్యక్తులు కూడా ఆ పార్టీని వీడటం జగన్‌కు గట్టి దెబ్బే అని చెప్పుకోవాలి. ఇప్పుడు సొంత ఇలాకా పులివెందులలో కూడా జగన్‌కు ఆ పార్టీ శ్రేణులు బిగ్ షాక్ ఇచ్చారు. జగన్ రాజకీయ కంచుకోట పులివెందులను టీడీపీ బద్దలు కొడుతోంది. జగన్ అనచురుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ