
ఢిల్లీ 17,డిసెంబర్ (హి.స.) భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఏపీజే అబ్దుల్ కలామ్ పేరును ఎన్నుకోవడానికి ముందు ఆ పదవికి భాజపా అటల్ బిహారీ వాజ్‌పేయీ () పేరును ప్రతిపాదించిందట (. ఆ సమయంలో వాజ్‌పేయీ మీడియా సలహాదారుగా ఉన్న అశోక్ టండన్ రాసిన పుస్తకం ‘అటల్ సంస్మరణ్’ (Atal Sansmaran)లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వాజ్‌పేయీ పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించి, ప్రధాని స్థానంలో ఆ పార్టీ అగ్రనేత ఎల్.కె.అడ్వాణీని ఎన్నుకోవాలని భాజపా సూచనలు చేసినట్లు అశోక్ టండన్ పేర్కొన్నారు. అయితే పార్టీ చేసిన ఈ ప్రతిపాదనను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ నిరాకరించినట్లు తెలిపారు. ప్రధానిగా ఉన్న తాను రాష్ట్రపతి పదవికి మారడం సరైన చర్య కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ