
ఢిల్లీ 18డిసెంబర్ (హి.స.)ఇండిగో సంక్షోభం సమయంలో తమకు అండగా నిలిచిన సిబ్బందికి ఆ విమానయాన సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ (IndiGo CEO Peter Elbers) ధన్యవాదాలు తెలిపారు. ఇండిగో ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎయిర్‌లైన్ రోజువారీ సర్వీసులు పునరుద్ధరించినట్లు వెల్లడించారు.
‘చాలా పెద్ద సవాలు నుంచి బయటపడ్డాం. ఇండిగో ఉద్యోగులు, మేము ఒకరికొకరం మద్దతుగా నిలిచి ఈ తుపాన్‌ను ఎదుర్కొన్నాం. బలంగా నిలబడ్డాం. మాకు మద్దతుగా నిలిచిన పైలట్లు, క్యాబిన్, ఎయిర్‌పోర్టు సిబ్బంది, కస్టమర్ సర్వీస్.. ఇలా అన్ని విభాగాలకు ధన్యవాదాలు. ఇండిగోకు అండగా నిలిచారు’ అని రాసుకొచ్చారు. విమానాల రద్దుకు ఇదీ కారణం అని చెప్పలేమని, అనేక అంశాలు ప్రభావితం చేశాయన్నారు. ఇకపై ఉద్యోగులు ప్రశాంతంగా ఉండాలని, వారు బాధ్యతలపై దృష్టిపెట్టాలని కోరారు. సంక్షోభానికి సంబంధించి వస్తున్న ఊహాగానాలకు దూరంగా ఉండాలని అభ్యర్థించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ