ఢిల్లీలో వాయు కాలుష్య కట్టడి: రంగంలోకి రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
న్యూఢిల్లీ, 18 డిసెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు నెలలుగా భారీగా కాలుష్యం పెరిగిపోతుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా షాహీన్ బాగ్ వంటి కీలక ప్రాంత
ఢిల్లీ కాలుష్యం


న్యూఢిల్లీ, 18 డిసెంబర్ (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు

నెలలుగా భారీగా కాలుష్యం పెరిగిపోతుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా షాహీన్ బాగ్ వంటి కీలక ప్రాంతాల్లో రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పియుసిసి లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకూడదని, అలాగే నిర్మాణ సామాగ్రిని తరలించే ట్రక్కులను నగరంలోకి అనుమతించకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

బీఎస్-4 (BS IV) కంటే తక్కువ ఉద్గార ప్రమాణాలు కలిగిన వాహనాలపై చర్యలు తీసుకునే అధికారాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వానికి కల్పించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande