వాయు కాలుష్యం కోరల్లో దేశ రాజధాని,50% మందికి ఇంటినుంచే పని
ఢిల్లీ 18డిసెంబర్ (హి.స.) దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రతరమవుతుండటంతో దిల్లీ ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. దిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలు.. గరిష్ఠంగా 50 శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలని పేర్కొంది. కాలుష్య నియం
Delhi Air Pollution


ఢిల్లీ 18డిసెంబర్ (హి.స.) దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రతరమవుతుండటంతో దిల్లీ ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. దిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలు.. గరిష్ఠంగా 50 శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలని పేర్కొంది. కాలుష్య నియంత్రణకు సంబంధించిన జీఆర్‌ఏపీ-3, జీఆర్‌ఏపీ-4 నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయినవారికి నష్టపరిహారంగా రూ.10 వేలు చెల్లిస్తామని కూడా తెలిపింది. ‘‘అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ సిబ్బందిలో 50 శాతం మందికి తప్పనిసరిగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యం కల్పించాలి. అత్యవసర సేవల విభాగాలకు మినహాయింపు ఉంటుంది. గతంలో 16 రోజులు జీఆర్‌ఏపీ-3 నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటి కారణంగా ప్రభావితమైన కార్మికులకు రూ.10వేలు పరిహారం ఇస్తాం’’ అని దిల్లీ కార్మిక శాఖ మంత్రి కపిల్‌ మిశ్ర తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande