
ఢిల్లీ 18డిసెంబర్ (హి.స.)దిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో తమ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీటును దిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు చెంపపెట్టు అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. తాజా పరిణామం నేపథ్యంలో మోదీ, షా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లకు మంగళవారం ఊరట లభించడంతో.. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా భాజపా కార్యాలయాల ఎదుట బుధవారం నిరసనలు చేపట్టింది. ప్రతీకార రాజకీయాల కోసం దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు వాడుకుంటోందని ఆరోపించారు. దాని తీరుపై పార్లమెంటు లోపల, వెలుపల పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. దిల్లీలో ఖర్గే విలేకర్లతో మాట్లాడుతూ.. గత 11 ఏళ్లలో 50 మందికి పైగా కీలక విపక్ష నేతలను ఆదాయపు పన్ను విభాగం, ఈడీ, సీబీఐల దుర్వినియోగంతో భయపెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ