
ఢిల్లీ 17,డిసెంబర్ (హి.స.) నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసు (National Herald case)పై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. న్యాయమే గెలిచిందంటూ ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నేషనల్ హెరాల్డ్ కేసు.. కేవలం రాజకీయ కక్ష సాధింపు తప్ప మరొకటి కాదు. అందుకే ఈ కేసు దాఖలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను స్వాతంత్ర్య సమరయోధులు 1938లో స్థాపించారు. సీబీఐ, ఈడీలను ఉపయోగించి కాంగ్రెస్ నాయకులను, ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని వేధించాలని ఈ వ్యక్తులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ కేసులో ఎలాంటి బలం లేదు’ అని ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ