
గుడివాడ, 17 డిసెంబర్ (హి.స.)
గుడివాడ పర్యటనలో ఉన్న అక్కినేని నాగార్జున కీలక ప్రకటన చేశారు. గుడివాడ ANR కాలేజీకి రూ.2 కోట్ల విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు అక్కినేని నాగార్జున. కృష్ణాజిల్లా గుడివాడలో ANR కళాశాల వజ్రోత్సవ కార్యక్రమం ఇవాళ జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అక్కినేని నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ANR కళాశాలలో రూసా భవనాన్ని నాగార్జున ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగార్జున మాట్లాడారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, చదువు కోలేకపోయిన వేలాది పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు చాలా కృషి చేసినట్లు గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV