బంగ్లాదేశ్‌ హైకమిషనర్‌కు భారత్ సమన్లు
ఢిల్లీ 17,డిసెంబర్ (హి.స.) బంగ్లాదేశ్‌ హైకమిషనర్‌ రిజాజ్‌ హమీదుల్లాకు భారత్‌ సమన్లు ) జారీ చేసింది. బంగ్లాలోని భారత దౌత్య కార్యాలయానికి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. అవి ఎలాంటి బెదిరింపులు అనేది ప్రత్యేకంగా వెల్లడించలేదు. బం
బంగ్లాదేశ్‌ హైకమిషనర్‌కు భారత్ సమన్లు


ఢిల్లీ 17,డిసెంబర్ (హి.స.) బంగ్లాదేశ్‌ హైకమిషనర్‌ రిజాజ్‌ హమీదుల్లాకు భారత్‌ సమన్లు ) జారీ చేసింది. బంగ్లాలోని భారత దౌత్య కార్యాలయానికి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. అవి ఎలాంటి బెదిరింపులు అనేది ప్రత్యేకంగా వెల్లడించలేదు.

బంగ్లా నాయకుడు హస్నత్ అబ్దుల్లా ఇటీవల భారత్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాను అస్థిరపరిస్తే.. సెవన్ సిస్టర్స్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజా సమన్లు జారీ అయినట్లు తెలుస్తోంది. కాగా.. గతేడాది విద్యార్థుల ఆందోళన తర్వాత షేక్‌ హసీనా ప్రధానిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి భారత్‌- బంగ్లా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా అక్కడి నాయకులు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్‌ వీటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande