
తిరుపతి, 17 డిసెంబర్ (హి.స.)
స్విమ్స్ లో పనులను వేగవంతం చేయాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) తెలిపారు. తిరుపతి స్విమ్స్ (SVIMS) ఆసుపత్రి ఆవరణలో నూతన భవనాలకు ఆయన బుధవారం ప్రారంభించారు. రూ.10.65 కోట్ల నిర్మించన కేంద్రీయ ఔషధ గిడ్డంగి రూ.4.40 కోట్లతో నిర్మించిన రోగుల సాయకుల వసతిని ఆయన ఆందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ స్విమ్స్ ను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారన్నారు. సీఎం ఆదేశాలతో స్విమ్స్ లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన గుత్తేదారులపై కేసులు పెట్టడం జరిగిందన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయన్నారు. తిరుపతి బర్డ్ హాస్పిటల్లో వసతులు సరిగ్గా లేవని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అందులో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV