సిడ్నీ ఉగ్రదాడి-దౌత్యవేత్తలకు సంబంధాలు.. ఖండించిన విదేశాంగశాఖ
ఢిల్లీ 17,డిసెంబర్ (హి.స.) ఆస్ట్రేలియాలో మారణహోమం (Sydney Shooting) సృష్టించిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌ (50)ను హైదరాబాదీగా గుర్తించిన విషయం తెలిసిందే. సాజిద్‌ ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకోకుండా ఇప్పటివరకు భారతీయ పాస్‌పోర్టుతోనే అక్కడ కొనసాగుతుండటం..
సిడ్నీ ఉగ్రదాడి-దౌత్యవేత్తలకు సంబంధాలు.. ఖండించిన విదేశాంగశాఖ


ఢిల్లీ 17,డిసెంబర్ (హి.స.) ఆస్ట్రేలియాలో మారణహోమం (Sydney Shooting) సృష్టించిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌ (50)ను హైదరాబాదీగా గుర్తించిన విషయం తెలిసిందే. సాజిద్‌ ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకోకుండా ఇప్పటివరకు భారతీయ పాస్‌పోర్టుతోనే అక్కడ కొనసాగుతుండటం.. నవంబరులో తన కుమారుడు నవీద్‌ అక్రమ్‌తో కలిసి ఫిలిప్పీన్స్‌కు వెళ్లి ఐసిస్‌ శిక్షణ తీసుకోవడంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిందితులతో సంబంధాలు ఉన్నాయన్న కారణాలతో ఫిలిప్పీన్స్‌లోని భారత దౌత్యవేత్తలపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ సమాచారం పూర్తి అవాస్తవమని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ఈ తప్పుడు పోస్టులను ఎవరూ నమ్మవద్దని కోరుతూ విదేశాంగ శాఖ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం (MEA Fact Check) ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande