
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై ఆసక్తికర ట్విట్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ వైఎస్ షర్మిల పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలుగురు రాజకీయ నాయకులు వైఎస్ షర్మిలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేసి షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమెకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థిస్తున్నానంటూ పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV