జగన్‌కు భారీ ఊరట.. సీబీఐ కోర్టు సంచలన తీర్పు
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.) వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు(YS Vivekananda Reddy murder case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకానందారెడ్డి(Vivekananda Reddy), జగన్‌(Jagan)కు మధ్య వివాదాలు ఉన్నట్లు ఆధారాలు లేవని సీబీఐ కోర్టు(Cbi Cout)తెలిపింద
/that-is-what-true-nation-building-is-all-about-former-cm-ys-jagan-501135


అమరావతి, 17 డిసెంబర్ (హి.స.)

వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు(YS Vivekananda Reddy murder case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకానందారెడ్డి(Vivekananda Reddy), జగన్‌(Jagan)కు మధ్య వివాదాలు ఉన్నట్లు ఆధారాలు లేవని సీబీఐ కోర్టు(Cbi Cout)తెలిపింది. వైఎస్ సునీత(Ys Sunitha)తరపున కూడా ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. వివేకానందారెడ్డి చనిపోతే బంధువులకు సమాచారం ఇవ్వడం సహజమని చెప్పింది. వివేకా హత్య ఛార్జిషీట్‌లోనూ జగన్ ప్రస్తావన లేదని తెలిపింది. హత్య జరిగిన రోజు ఉదయం జగన్‌కు ఫోన్ కాల్‌పై మరింత దర్యాప్తు అవసరంలేదని చెప్పింది. వివేకా హత్య రోజు కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య జరిగిన మెసేజ్‌లపైనే దర్యాప్తు చేయాలని సీబీఐ కోర్టు ఆర్డర్ వేసింది. ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీ ప్రతులు బయటకు రావడంతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వైఎస్ జగన్‌తో ఉన్న వివాదాల నేపథ్యంలోనే వివేకా హత్య జరిగిందని సునీత తరపున వినిపిస్తున్న వాదనలపై సీబీఐ కోర్టు తీర్పుతో క్లారిటీ వచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande