
ఢిల్లీ 18డిసెంబర్ (హి.స.)బంగ్లాదేశ్‌లోని భారత దౌత్య కార్యాలయం భద్రతపై మన దేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢాకాలోని ఈ కార్యాలయంవద్ద నిరసనలు చేపట్టాలని కొన్ని సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) స్పందించింది. బంగ్లాదేశ్ రాయబారి రియాజ్ హమీదుల్లాను బుధవారం పిలిపించి నిరసనను తెలియజేసింది. అయినప్పటికీ బుధవారం మధ్యాహ్నం ‘జులై ఐక్య’ (జులై యూనిటీ) పేరుతో బ్యానర్‌ను పట్టుకుని ఓ బృందం ఢాకాలోని భారత హైకమిషన్‌వైపు మార్చ్‌ను నిర్వహించింది. మాజీ ప్రధాని హసీనాను, భారత్‌లో తలదాచుకుంటున్న మరికొంత మంది అవామీ లీగ్ సభ్యులనూ తిరిగి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని నిరసనకారులు డిమాండు చేశారు. రాంపుర వంతెనపై నుంచి ప్రారంభమైన నిరసనలను పోలీసులు అడ్డుకున్నారని అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్‌లో ఉన్న వీసా దరఖాస్తు కేంద్రాన్ని (ఐవీఏసీ) భద్రతాపరమైన కారణాలతో భారత్ మూసివేసింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ