
కడప 18 డిసెంబర్ (హి.స.) :దేశబాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలకొనియాడిన తెలుగు భాష అతి ప్రాచీనమైనది. దీనికి సంబంధించిన తొలి తెలుగు శాసనం)ఎర్రగుంట్ల మండలంలోని కలమల్ల గ్రామం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో ఉండటం గర్వకారణం. క్రీ.శ. 575లో నాటి రేనాటి చోళరాజు ధనుంజయుడు తొలితెలుగు శాసనాన్ని ఇక్కడ వేయించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆయన పరిపాలనలో తెలుగుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతున్నారు. అలాగే క్రీ.శ. 1479లో సదాశివ దేవరాయులు ఆధ్వర్యంలో రెండవ శాసనం వేయించారు. క్రీ.శ. 1525లో ఓరవీర ప్రతాపరాయులు మూడవ శాసనం, 1529లో శ్రీకృష్ణదేవరాయుల పరిపాలనలో 4వ శాసనాన్ని వేయించారు. అప్పట్లో తెలుగు బాషపై ఉన్న మక్కువ, గౌరవం నాటి రాజుల తీరును బట్టే అర్థమౌతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ