
ఢిల్లీ 18డిసెంబర్ (హి.స. ) రెండోరోజు ఒమన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. పలు అంశాలపై అగ్రనేతలతో మోదీ చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై చర్చించనున్నారు. ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ ఇథియోపియా నుంచి బుధవారం ఒమన్‌కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ఉప ప్రధానమంత్రి సయీద్ షిహాబ్ బిన్ తారిఖ్ అలీ సైద్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. భారత్, ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. మోదీ ఇవాళ (గురువారం) ఒమన్ ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
ఈ సందర్భంగా కీలకమైన వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేసే అవకాశం ఉంది. భారత్, ఒమన్ మధ్య చరిత్రాత్మకమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తన పర్యటనలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ