ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
కొచ్చి: /ఢిల్లీ 18డిసెంబర్ (హి.స. ) ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. జెడ్డా నుండి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX 398)లో గురువారం ఉదయం సమస్య ఏర్పడటంతో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది.
AIR INDIA


కొచ్చి: /ఢిల్లీ 18డిసెంబర్ (హి.స. ) ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. జెడ్డా నుండి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX 398)లో గురువారం ఉదయం సమస్య ఏర్పడటంతో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఆ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.

ఎయిరిండియా విమానం కోజికోడ్‌కు వెళ్తుండగా, కుడి వైపు ప్రధాన ల్యాండింగ్ గేర్, టైర్‌లో సమస్య ఏర్పడింది. దాంతో వెంటనే విమానాన్ని కొచ్చి వైపు మళ్లించి ఉదయం 9 గంటల సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ నిర్వహించారు. CIAL (Cochin International Airport Limited) ప్రకటన ప్రకారం.. అన్ని అత్యవసర సేవలను ముందుగానే సిద్ధం చేసి, ల్యాండింగ్‌ను విజయవంతంగా సులభతరం చేశారు.

ల్యాండింగ్ తర్వాత చేసిన తనిఖీలో కుడి వైపున ఉన్న రెండు టైర్లు పగిలిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందికి ఎటువంటి గాయాలు జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande