
ఢిల్లీ, 18 డిసెంబర్ (హి.స.)మా పోరాటం నరేగా (NREGA Name Change) పేరు మార్పుపై కాదని, హక్కులు కాపాడటం కోసమేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు కేంద్ర ప్రభుత్వం పేదల పని హక్కులను తొలగిస్తోదని ధ్వజమెత్తారు. పేదల కోసం చివరి వరకు పోరాడుతామన్నారు. నరేగా పేరు మార్పుపై ఇవాళ విపక్షాలు పార్లమెంట్ ఆవరణంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో మల్లికార్జున ఖర్గేతో పాటు పెద్దఎత్తున విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. మహాత్మగాంధీ ఫోటోలు, ఫ్లెక్సీ పట్టుకుని పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం నుండి మక్కర్ దావర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
ఇక కేంద్రం తీసుకువచ్చిన జీ రామ్ జీ బిల్లుకు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని వివిధ సంఘాలు నిర్ణయించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV