
తిరువంతపురం, 18 డిసెంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి పినరయి విజయన్ (CM Pinarayi Vijayan)కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు (KIIFB) మసాలా బాండ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జారీ చేసిన షోకాజ్ నోటీసులపై మూడు నెలల పాటు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ వీజీ అరుణ్ ధర్మాసనం కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, KIIFB సీఈవో కేఎం అబ్రహాంలకు కూడా కేసులో స్టే వర్తించనుంది.
కాగా, 2019లో KIIFB రూ.2,150 కోట్లను మసాలా బాండ్స్ ద్వారా సేకరించిన విషయంలో తెలిసిందే. ఈ నిధులు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించారు.
అయితే, ఈ నిధుల్లో కొం సొమ్మును భూమి కొనుగోలుకు వినియోగించడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలకు విరుద్ధమని ఈడీ ఆరోపించింది. భూమి కొనుగోలు రియల్ ఎస్టేట్ యాక్టివిటీగా పరిగణించి, ఇది ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ECB) నిబంధనలను ఉల్లంఘించారని ఈడీ పేర్కొంది. నవంబర్ 2025లో ఈడీ రూ.467 కోట్ల ఫెమా (FEMA) ఉల్లంఘనలపై సమాధానం ఇవ్వాలని విజయన్, ఐజాక్, అబ్రహాంలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV