
ఢిల్లీ 18డిసెంబర్ (హి.స. ) బీహార్‌లో హిజాబ్ వ్యవహారం ముదురుతోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవహార శైలిని ఇప్పటికే విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తుంటే.. ఇప్పుడు దాయాది దేశానికి చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ హత్యా బెదిరింపునకు దిగాడు.
పాకిస్థాన్‌కు చెందిన ఒక గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టి వీడియో సందేశం ద్వారా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను హెచ్చరించారు. వైద్యురాలి హిజాబ్‌ను తొలగించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. లేదంటే చంపేస్తానంటూ బెదిరించాడు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తిస్తాడా? అని ప్రశ్నించాడు. తక్షణమే క్షమాపణ చెప్పాలని కోరాడు. చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చని వార్నింగ్ ఇచ్చాడు. గ్యాంగ్‌స్టర్ వీడియోను పరిశీలిస్తున్నట్లు బీహార్ డీజీపీ వినయ్ కుమార్ అన్నారు. వీడియోపై పాట్నా డీజీ స్థాయిలో విచారణ జరుగుతోందని.. మిగతా విషయాలు తర్వాత పంచుకుంటామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ