గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో కలుషిత ఆహారం
: గద్వాల , 2 డిసెంబర్ (హి.స.) : గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతిగృహంలో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యు
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో కలుషిత ఆహారం


: గద్వాల , 2 డిసెంబర్ (హి.స.)

: గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతిగృహంలో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇవాళ ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు వెళ్లారు. అరగంట అనంతరం విద్యార్థులకు వాంతులు కావడంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఉదయం పెట్టిన ఉప్మాలో పురుగులు వచ్చాయని, ఆ విషయాన్ని వార్డెన్‌కు చెప్పడంతో పారవేశారని విద్యార్థులు తెలిపారు. ఆ తర్వాత అరటిపళ్లు, బిస్కెట్లు తిని స్కూల్‌కి వెళ్లారు. కొద్దిసేపటికే కడుపునొప్పి, వాంతులైనట్లు విద్యార్థులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande