తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో నిర్జీవంగా పడి ఉన్న మూడు మృతదేహాలు
అమరావతి, 2 డిసెంబర్ (హి.స.) తిరుపతి,తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహా సముదాయంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఒక ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ ఇంటి తలుపులు పగల
తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో నిర్జీవంగా పడి ఉన్న మూడు మృతదేహాలు


అమరావతి, 2 డిసెంబర్ (హి.స.)

తిరుపతి,తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహా సముదాయంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఒక ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ ఇంటి తలుపులు పగలకొట్టారు. ఆ ఇంట్లో నిర్జీవంగా పడి ఉన్న మూడు మృతదేహాలను గుర్తించారు. అనంతరం ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీష్‌గా పోలీసులు గుర్తించారు. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు బయటపడడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande