తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు చీరలు.. సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.) టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (PCC) సమావేశం జరిగింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జిల్లా కాంగ్రెస్ కమ
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.)

టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (PCC) సమావేశం జరిగింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులుగా నియమితులైన వారికి సర్పంచ్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తర్వలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకోబొతున్నామని గుర్తు చేశారు. అలాగే డీసీసీ పదవి నేతలకు పార్టీ ఇచ్చిన గౌరవమని సీఎం చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలని వారికి సూచించారు.

అలాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలిస్తే ప్రజలు తిట్టుకున్నారు. కానీ నేడు ఇందిరమ్మ చీరలు మాకెందుకు ఇవ్వడంలేదని అడుగుతున్నారని, ప్రతి మహిళలకు చీర అందేలా చూడాల్సిన బాధ్యత డీసీసీలదే అన్నారు. అలాగే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు చీరలిస్తున్నామని, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని చూస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. అలాగే గత బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో, నేటి ప్రజా పాలన ఎలా ఉందో చర్చ పెట్టాలని, తనకు 8 లక్షల కోట్ల అప్పుతో ప్రభుత్వాన్ని అప్పజెప్పారని, అయినా కూడా సంక్షోభం నుంచి సంక్షేమం వైపు రాష్ట్రాన్ని తాము తీసుకెళ్తున్నామని సీఎం అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande