
హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.)
ఫ్యూచర్ సిటీకి కేంద్రం నిధులివ్వకపోతే బిజెపిని భూస్థాపితం చేస్తామంటూ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచంద్రారావు ఖండచారు , మీడియా ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు.
.బిజెపి అంటే భయం పట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా అబద్ధపు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేస్తోంది.
గత రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో చేసిందేమీ లేదు.
ప్రజలకు ఇచ్చిన మాటలను, వాగ్ధానాలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. గత బీఆర్ఎస్ సర్కారు లాగానే ఫెయిల్యూర్ పాలన అయ్యింది.
తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మొత్తం ఫ్లాప్ అయ్యింది. హెల్త్, ఎడ్యుకేషన్, డెవలప్ మెంట్.. ఇలా అన్నింటిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లాప్ అయింది. అందుకే రేవంత్ రెడ్డి సర్కారును ప్రజలు భూస్థాపితం చేయబోతున్నారు.
ఫ్యూచర్ సిటీకి కేంద్ర నిధులు ఎందుకు, ఎలా ఇవ్వాలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆలోచించిందా? సిటీ ప్లానింగ్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది.
కేవలం కేంద్రం మీద ఏడవడమే కాంగ్రెస్ పాలసీ.
అమృత్ స్కీం, స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్.. ఇలా అనేక పథకాలకు కేంద్రం ఏనాడు నిధులు ఆపలేదు.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై బిజెపి అక్రమ కేసులు పెట్టారని ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ముందుకు ఈ కేసుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విచారణకు హాజరు కావాలి.
సుప్రీంకోర్టు ద్వారా బయటకు వచ్చిన విషయాల ప్రకారం, నేషనల్ హెరాల్డ్‌లో అవినీతి, గాంధీ, నెహ్రూ ఫ్యామిలీ ప్రాపర్టీలకు సంబంధించి అన్ని బినామీలు వెలుగులోకి వచ్చాయి. గాంధీ, నెహ్రూ ఫ్యామిలీలకు నేషనల్ హెరాల్డ్ ATMలా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ ప్రజా సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు? రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదు? ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదు? రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదు? గ్రామాల అభివృద్ధి పై ఎందుకు శ్రద్ధ చూపడం లేదు? ముందుగా రేవంత్ రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అంతేగాని బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం వంటి వ్యవహారాలను ఖండిస్తున్నాం.
భారత ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ ‘సంచార్ సాథీ’ విషయంలో, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతుంటాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా తీసుకొచ్చే ఏ పథకం, ఏ యాప్ అయినా ప్రజాసంక్షేమం, భద్రత కోసం మాత్రమే ఉంటుంది.
భారత ప్రభుత్వం రూపొందించిన ‘సంచార్ సాథీ’ యాప్, డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రజాసంక్షేమం, భద్రత కోసం తీసుకొచ్చారు. మొబైల్ సబ్‌స్క్రైబర్‌లను శక్తివంతం చేయడానికి, భద్రత బలోపేతం చేయడానికి, సైబర్ సెక్యూరిటీ కోసం యాప్ ఉపయోగపడుతుంది.
‘సంచార్ సాథీ’ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్లలో ఎవరి వ్యక్తిగత సమాచారం కూడా వేరేవారికి వెళ్లదు. సుప్రీంకోర్టు ఈ యాప్‌పై మానిటరింగ్ చేసింది, ట్రాకింగ్ కూడా జరిగింది.
ఇటువంటి అంశంపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుండటాన్ని ఖండిస్తున్నాం. ప్రజలు ఈ తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలి.
కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పుట్ట… 'Mother of All Lies'. కాంగ్రెస్ నాయకులు వదంతులు, అబద్ధపు ప్రచారాన్ని వ్యాప్తి చేయడంలో, గోబెల్స్ ప్రచారం చేయడంలో ప్రావీణ్యం కలిగినవారు. అందుకే కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను ఎవరు నమ్మకూడదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు