మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. ప్రాక్టీస్ తో చెమటోడుస్తున్న సీఎం ..!
హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) తో ఫుట్బాల్ ఆడేందుకు సిద్ధమయ్యారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీని ఢీకొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రాక్టీస్ మొదలు
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) తో ఫుట్బాల్ ఆడేందుకు సిద్ధమయ్యారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీని ఢీకొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. భారత పర్యటనలో భాగంగా అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ ఈ నెల డిసెంబర్ 13న హైదరాబాద్ నగరానికి విచ్చేయనున్నారు. అదే రోజున మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తరువాత డిసెంబర్ 13న సాయంత్రం ఉప్పల్ మైదానంలో లియోనెల్ మెస్సీ టీమ్ తో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ అంతర్జాతీయ దిగ్గజ ఆటగాడితో తలపడటానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande