
అమరావతి, 2 డిసెంబర్ (హి.స.)బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు జిల్లాలకు వర్షసూచన ఉందన్నారు. మంగళవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అటు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాచలంలో అత్యధికంగా 22 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV