
హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.)
హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల పిస్తా హౌస్, షా గౌస్, మేహిఫిల్ హోటల్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు ఇవాళ వుడ్ బ్రిడ్జ్ హోటల్ (Wood Bridge Hotel) యజమాని ఇంట్లో సోదాలు చేపడుతున్నారు. ఈ మేరకు ఆ హోటల్ ఓనర్ హర్షద్ అలీ ఖాన్ను అదుపులోకి తీసుకుని, గతంలో ఐటీ దాడులు జరిగిన పిస్తా హౌస్, ఇతర హోటళ్లు, రెస్టారెంట్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..