ఐదు గ్రామాల్లో నామినేషన్లు నిల్.. 133 వార్డుల్లోనూ అదే పరిస్థితి
హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో మొదటి విడతలో సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ఐదు గ్రామాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇందులో మంచిర్యాల జిల్లాలో మూడు గ్రామాలు ఉండగా, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కో గ్రామం చొప్పున ఉన్నది.
సర్పంచ్ ఎలక్షన్స్


హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో మొదటి విడతలో

సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ఐదు గ్రామాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇందులో మంచిర్యాల జిల్లాలో మూడు గ్రామాలు ఉండగా, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కో గ్రామం చొప్పున ఉన్నది. ఇంకా 133 వార్డులకు కూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కానట్టు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. ఇందులో మంచిర్యాల జిల్లాలో 34 వార్డులు, ఆసిఫాబాద్ జిల్లాలో 30, జనగామమలో 10, వికారాబాద్ లో 19, గద్వాలలో 9, నిర్మల్ లో ఏడు, ములుగులో నాలుగు, ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో మూడు చొప్పున, భువనగిరి, మెదక్, ఖమ్మం జిల్లాల్లో రెండు చొప్పున, సూర్యాపేట, జగిత్యాల, వనపర్తిలో ఒక్కొక్కటి చొప్పున వార్డులు ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల సమస్యల తలెత్తడంతోనే నామినేషన్లు దాఖలు కానట్టు తెలుస్తున్నది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande