కేసీఆర్ శకం ఇక ముగిసినట్లే: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.) గాంధీ భవన్లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డీసీసీలదే కీలక పాత్ర అని చెప్పారు. సీఎం పర్యటనల దృష్ట్యా డీసీసీలు అందరూ అలర్ట్ ఉండాలన్నా
మహేష్ కుమార్


హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.)

గాంధీ భవన్లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డీసీసీలదే కీలక పాత్ర అని చెప్పారు. సీఎం పర్యటనల దృష్ట్యా డీసీసీలు అందరూ అలర్ట్ ఉండాలన్నారు. తను జిల్లా అధ్యక్షుడిని కాలేకపోయానని.. కానీ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం లభించిదని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ పరిశీలకుల చేత డీసీసీల నియామకం జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అందరూ అణగారిన వర్గాల కోసం కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. రెండేళ్ల కాలంలో ఆరు గ్యారెంటీల్లో మెజార్టీ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. తప్పకుండా పనికి తగిన గుర్తింపు దక్కుతుందన్నారు. అంతే కాకుండా కేసీఆర్ శకం ముగిసింది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande