తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడవు.! మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.) ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ''నర దిష్టి'' వ్యాఖ్యలపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చాడు. ‘నర దిష్టి'' అంశంలో పవన్ కల్యాణ్ అవగాహన లేకుం
మంత్రి కోమటిరెడ్డి


హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.)

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'నర దిష్టి' వ్యాఖ్యలపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చాడు. ‘నర దిష్టి' అంశంలో పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు.

పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా చేసిన ‘నర దిష్టి' వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఆయన వెంటనే క్షమాపణలు చెప్తే, తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం ఒకటి రెండు రోజులైన ఆడే అవకాశం ఉంటుంది. లేదంటే, సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నాను, తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం అంటూ కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande