డైవర్షన్ పాలిటిక్స్ బీజేపీకి అలవాటే.. మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.) నేషనల్ హెరాల్డ్ కేసు లో ఢిల్లీలోని ఎకానమిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) కాంగ్రెస్ అగ్రనేతలపై సహా మరికొందరిపై కొత్త ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై క
మంత్రి పొన్నం ప్రభాకర్


హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.)

నేషనల్ హెరాల్డ్ కేసు లో ఢిల్లీలోని ఎకానమిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) కాంగ్రెస్ అగ్రనేతలపై సహా మరికొందరిపై కొత్త ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కొత్త ఎఫ్ఎఆర్ (FIR) నమోదు చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. డైవర్షన్ పాలిటిక్స్లో తమ అగ్రనేతలపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు పార్లమెంటులో చర్చకు రాకుండా ఉండేందుకు నేషనల్ హెరాల్డ్ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వెంట దేశం మొత్తం ఉందని.. భయపడే ప్రసక్తే లేదని అన్నారు. పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు వచ్చినా.. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం బీజేపీకి అలవాటేనని మంత్రి పొన్నం చురకలంటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande