
నిజామాబాద్, 2 డిసెంబర్ (హి.స.)
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ నూతన కమిషనర్ గా ఎం. రవిబాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు రవిబాబు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలోని అధికారులందరూ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రవి బాబుకు పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన మున్సిపల్ కమిషనర్ రవిబాబు మాట్లాడారు. ఆర్మూర్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్, మిగతా అందరి సంపూర్ణ సహకారం తో ఆర్మూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నిలుపుతాననీ పేర్కొన్నారు. కాగా ఇంతకుముందు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించిన రాజు ఇటీవల ఓ ఇంటి నిర్మాణానికి నెంబర్ కేటాయించే విషయంలో ఆయన వ్యక్తిగత డ్రైవర్ సహాయంతో లంచం ఏసీబీకి చిక్కి అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు