
న్యూఢిల్లీ, 2 డిసెంబర్ (హి.స.)
స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ అయిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్(INS Aridaman)ను త్వరలో జలప్రవేశం చేయనున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్ట్ 75 ఇండియా కింద ఆరు అత్యాధునిక సబ్మెరైన్లను కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. త్వరలో కాంట్రాక్టు కుదరనున్నదన్నారు. 2029 నాటికి నేవీలోకి నాలుగు రఫేల్ యుద్ధ విమానాలు రానున్నట్లు చెప్పారు. గత ఏడాది నేవీ డే నుంచి ఇప్పటి వరకు ఓ సబ్మెరైన్తో పాటు నేవీ షిప్లను కమీషన్ చేసినట్లు ఆయన తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు