మీడియా సెంటర్, ఎంసిఎంసి కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, 2 డిసెంబర్ (హి.స.) గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసిఎంసి) సెల్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారె
నిజామాబాద్ కలెక్టర్


నిజామాబాద్, 2 డిసెంబర్ (హి.స.)

గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసిఎంసి) సెల్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. ఎన్నికల సందర్భంగా ఎంసిఎంసి ద్వారా చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంసిఎంసి కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం కంట్రోల్ రూమ్ ను సందర్శించి ఎన్నికలతో ముడిపడిన అంశాలకు సంబంధించి ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, సూచనలను పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande