
హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.)
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు
రెచ్చిపోతున్నారు. సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ ఫోటో, పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతున్నారు. ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే వెంటనే మెసెంజర్ లో వారి కాంటాక్ట్ నంబర్ అడిగి డబ్బులు కావాలని కోరుతూ సందేశాలు పంపుతున్నారు. విషయం సీపీ దృష్టికి వెళ్లడంతో ఆయన అప్రమత్తం అయ్యారు. అలాంటి రిక్వెస్ట్ లకు సందేశాలకు ఎవరూ స్పందించవద్దని సూచించారు. నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..