
నల్గొండ, 2 డిసెంబర్ (హి.స.)
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి
కొనసాగుతోన్న వేళ రాష్ట్రంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓటరు లిస్టులో తమ పేర్లు రాలేదంటూ నల్గొండ జిల్లా దామరచర్ల గ్రామ పంచాయతీకి చెందిన ఓటర్లు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వారి పిటిషన్పై మరో రెండు రోజుల్లో విచారణ జరగనుంది. అయితే, ఓటరు జాబితా నుంచి అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా ఓటును తొలగిస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-226 కింద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అధికారం ఉంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు