మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్స్లు ఓపెన్.. ఎమ్మెల్యే ఆదేశాలు అమలు
నల్గొండ, 2 డిసెంబర్ (హి.స.) ప్రజలను ఆరోగ్యంగా, ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్న మద్యం అధిక తాగుడుకు కళ్లెం వేయడానికి మద్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో వైన్స్ల గురించి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న కొత్త నిబంధనలు అమలులోకి వచ్చా
ఎమ్మెల్యే కోమటిరెడ్డి


నల్గొండ, 2 డిసెంబర్ (హి.స.)

ప్రజలను ఆరోగ్యంగా, ఆర్థికంగా

చిన్నాభిన్నం చేస్తున్న మద్యం అధిక తాగుడుకు కళ్లెం వేయడానికి మద్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో వైన్స్ల గురించి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. మద్యం షాపుల యజమానులు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నేటి నుండి కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్స్లను ఓపెన్ చేయనున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూంలోకి అనుమతించునున్నారు.

మద్యం షాపులకు కొత్తగా టెండర్లు వేసే సందర్భంలోనే మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకునే యజమానులకు బెల్ట్ షాపులు నిర్వహించొద్దని సిండికేట్ అవ్వకూడదని, ఊరి బయటే మద్యం విక్రయాలు జరపాలని, పర్మిట్ రూంలకు అనుమతించొద్దని ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande