ప్రకాశం జిల్లా అర్థవీడు మండలంలో షాకింగ్ ఘటన. చోటుచేసుకుంది
ప్రకాశం, 2 డిసెంబర్ (హి.స.) జిల్లా అర్ధవీడు మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ బస్సుపై క్లీనర్ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అర్ధవీడు మండలం పాపినేని పల్లిలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది మంగళవారం ఉదయం ఆ
ప్రకాశం జిల్లా అర్థవీడు మండలంలో షాకింగ్ ఘటన. చోటుచేసుకుంది


ప్రకాశం, 2 డిసెంబర్ (హి.స.)

జిల్లా అర్ధవీడు మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ బస్సుపై క్లీనర్ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అర్ధవీడు మండలం పాపినేని పల్లిలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది

మంగళవారం ఉదయం ఆ స్కూల్ బస్సును నడుపుతున్న డ్రైవర్, క్లీనర్ మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. దీంతో క్లీనర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పెట్రోల్ తీసుకొచ్చి బస్సుపై వేసి నిప్పంటించాడు. దీంతో బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. అప్పటికింకా పిల్లలెవరూ బస్సు ఎక్కకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది (viral bus fire news).

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ నభికి మంటలు అంటుకుని స్వల్పంగా గాయాలయ్యాయి (cleaner driver clash). అతడిని స్థానికులు వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన క్లీనర్ గోపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande