
అమరావతి, 2 డిసెంబర్ (హి.స.)
:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైబ్రరీ భవన డిజైన్, ఆర్కిటెక్ట్ కన్సల్టెంట్ ఎంపిక, నిర్మాణ ప్రణాళికల పరిశీలన కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీ ఛైర్మన్‌గా పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శిని నియమించగా, సభ్యులుగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, సమగ్ర శిక్షా చీఫ్ ఇంజినీర్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిపుణులతోపాటు ఇతర సాంకేతిక నిపుణులు ఉంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ, సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌లకు తదుపరి చర్యలు త్వరగా చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ