
అమరావతి, 2 డిసెంబర్ (హి.స.) - అమరావతి: విజయవాడ-హైదరాబాద్ ఎన్‌హెచ్-65 ఆరు వరుసల విస్తరణలో భాగంగా నగర పరిధిలో భారీ పైవంతెన నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. గొల్లపూడి నుంచి కనకదుర్గ వారధి వరకు 5 కి.మీ. మేర దీన్ని నిర్మించే ప్రతిపాదనలను కన్సల్టెన్సీ డీపీఆర్‌లో పొందుపరిచింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వారికి ఈప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ పరీక్ష పెడుతోంది. ఈ పైవంతెన నిర్మిస్తే సాఫీగా రావచ్చు. ప్రస్తుత రహదారిని సర్వీస్ రోడ్డుగా మారుస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ